Rafale vs J-16: చైనా, ఈజిప్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో చైనా తయారీ J-16 ఫైటర్ జెట్లు తొలిసారిగా రఫేల్ యుద్ధ విమానాలతో నేరుగా వైమానిక పోరాట విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ యుద్ధ విన్యాసానాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ‘‘ఈగల్స్ ఆఫ్ సివిలైజేషన్’’ పేరుతో జరుగుతున్న ఈ సైనిక కార్యక్రమంలో రఫేల్, J-16 జెట్లు పోరాట విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ పెద్ద ఎత్తున ఫ్రెంచ్ తయారీ రఫేల్ జెట్లను కొనుగోలు చేసింది. ఇలాంటి సమయంలో ఒక రఫెల్ జెట్, చైనా జెట్‌తో పోరాటంతో పాల్గొనడం ఆసక్తిగా మారింది.
J-16 చైనాకు చెందిన మల్టీరోల్ ఫైటర్ జెట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. గతేదాడి భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ నుంచి రఫెల్, పాకిస్తాన్ నుంచి చైనా తయారీ J-10 జెట్ల పాల్గొన్నాయి. ఇది J-16 కంటే, J-10 కన్నా పెద్దదిగా, ఎక్కువ ఆయుధాలు మోసుకెళ్లేదిగా భావిస్తారు. దీంట్లో రెండు ఇంజన్లు, రెండు సీట్లు ఉంటాయి. దీర్ఘకాలిక మిషన్ల కోసం వీటిని చైనా తయారు చేసింది. ప్రస్తుతం చైనా-పాకిస్తాన్ సంయుక్తంగా JF-17 తయారు చేశాయి. ప్రస్తుతం J-16 విమానాలు కొనుగోలు చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. మరోవైపు, భారత్ ఫ్రాన్స్ నుంచి మరో 114 రఫేల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
J-16 vs రఫేల్:
చైనా-ఈజిప్ట్ సైనిక విన్యాసాల రెండో దశ ఆగస్టు 22న ప్రారంభమయ్యాయి. సోమవారం చైనాకు చెందిన J-16 జెట్లు రఫేల్ విమానాలతో వన్-టు-వన్ వైమానిక పోరాట విన్యాసాల్లో పాల్గొన్నాయి. వాస్తవంగా యుద్ధం జరిగే పరిస్థితుల్లో ఎలాంటి పోరాటం ఉంటుందో అలా రెండు ఫైటర్ జెట్లు తలపడ్డాయి. చైనా విడుదల చేసిన వీడియోల్లో రఫేల్ విమానం J-16కు అత్యంత సమీపంలో విన్యాసాలు చేస్తూ కనిపించింది. ఇలా చైనీస్ ఫైటర్ జెట్‌తో రఫేల్ తలపడటం ఇదే తొలిసారి. ఈ రెండు యుద్ధ విమానాలను 4.5 జనరేషన్ యుద్ధ విమానాలుగా భావిస్తారు.
భారత్ రఫేల్ భిన్నం:
భారత్ వద్ద ఉన్న రఫేల్ జెట్లలో ప్రత్యేక అప్‌గ్రేడ్లు ఉన్నాయి. ఈజిప్ట్ ఉపయోగించిన రఫేల్‌తో పోలిస్తే భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు భిన్నంగా ఉంటాయి. దీంతో భారత రఫేల్‌ను, చైనా J-16 మధ్య పోలిక తేవడం సులభం కాదు. గత ఏడాది భారత్-పాకిస్థాన్ ఘర్షణ అనంతరం రఫేల్ విమానాల ప్రతిష్ఠను దెబ్బతీసి ఫ్రెంచ్ యుద్ధ విమానాల విక్రయాలను ప్రభావితం చేసేందుకు చైనా తప్పుడు ప్రచారం నిర్వహించిందని అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందింది.
భారత్ ఎందుకు గమనిస్తోంది.?
గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ రఫేల్ యుద్ధ విమానాలు, పాకిస్తాన్‌కు చెందిన J-10 యుద్ధ విమానాలు యుద్ధంలో పాల్గొన్నాయి. దీంతో చైనా చైనా J-16 సామర్థ్యాలను భారత్ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఇదే సమయంలో పాకిస్తాన్, చైనాల రక్షణ బంధం బలపడుతోంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ చైనీస్ జెట్లను కొనుగోలు చేస్తే ఎలా పోరాడాలి అనే దానిపై అవగాహన ఉండటం కీలకం. పాక్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో అమెరికా తయారీ F-16లు, చైనా తయారీ JF-17లు సహా కనీసం డజను సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. ఇప్పుడు చైనా J-16 సామర్థ్యాలు తెలిస్తే ఎలా పోరాడాలి అనే దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

