Site icon NTV Telugu

భ‌య‌పెడుతున్న ఆర్ ఫ్యాక్ట‌ర్‌… మరింత పెరిగితే క‌ష్ట‌మే…

భార‌త్‌లో రోజువారీ క‌రోనా కేసులు 40 వేల వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి.  మ‌ర‌ణాల సంఖ్య కూడా 500 ల‌కు పైగానే న‌మోద‌వుతున్న‌ది.  సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  ప‌లు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 దాటిన‌ట్టు గ‌ణాంకాలు అంద‌టంతో ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతున్న‌ది.  సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉండ‌గా ఆర్ ఫ్యాక్ట‌ర్ 1.4కి చేరింది. కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత ఇది 0.7కి చేరింది.  అయితే, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 కి మించి న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌భుత్వాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నాయి.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆర్ ఫ్యాక్ట‌ర్ అత్య‌ధికంగా 1.34గా ఉన్న‌ది.  హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో 1.3, నాగాలాండ్‌లో 1.09గా ఉన్న‌ది.  అయితే, ప్ర‌స్తుతం కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న కేర‌ళ‌లో ఆర్ ఫ్యాక్ట‌ర్ 1.06 గా ఉంది. క‌రోనా సోకిన వ్య‌క్తి నుంచి ఎంత మందికి వైర‌స్ సోకుతుంది అనే అంశం ఆధారంగా ఆర్ ఫ్యాక్ట‌ర్‌ను నిర్ణయిస్తారు. దేశంలో ఈ ఆర్ ఫ్యాక్ట‌ర్ స‌రాస‌రి 1.01గా ఉంది.  ఈ ఆర్ ఫ్యాక్ట‌ర్ పెరిగితే మ‌రింత ప్ర‌మాద‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

Read: అర్హ ‘శాకుంతలం’ సెట్స్ లో నాన్న అల్లు అర్జున్!

Exit mobile version