ప్రముఖ పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా(35) హఠాన్మరణం చెందారు. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. 11 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇన్ని రోజులు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. సోలన్ జిల్లా బడ్డి సమీపంలో బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదంలో చిక్కుకున్నారు. తీవ్రగాయాలు కావడంతో మొహాలిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స అందించారు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కారణంగా స్పృహలోకి రాలేదు. రాజ్‌వీర్ జవాండా బుధవారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్
సెప్టెంబర్ 27న జవాండా 1300 సీసీ మోటారు సైకిల్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాకు విహారయాత్రకు బయల్దేరివెళ్లారు. సోలన్ జిల్లా బడ్డి సమీపంలో అడ్డుగా వచ్చిన పశువులను ఢీకొట్టడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మొహాలీలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 11 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రకు మోటారు సైకిల్ వెళ్లొద్దని జవాండా భార్య చెప్పినా వినకుండా వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TATA War: టాటా గ్రూప్‌లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ
రాజ్‌వీర్ జవాండా…
రాజ్‌వీర్ జవాండా 1990లో జన్మించారు. లూథియానాలోని జాగ్రావ్‌లోని పోనా గ్రామవాసి. కొన్ని హిట్ పంజాబీ పాటలకు ప్రసిద్ధి చెందారు. ‘‘కాకా జీ’’, ‘‘సుబేదార్ జోగిందర్ సింగ్’’, ‘‘జింద్ జాన్’’ వంటి పాటలు పాపులర్ అయ్యాయి. సుబేదార్ జోగిందర్(2018), జింద్ జాన్(2019), మిండో తసీల్దార్నీ (2019) వంటి పంజాబీ చిత్రాల్లో కూడా నటించాడు.
