Site icon NTV Telugu

Bhagwant Mann: మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన విదేశాంగ శాఖ

Bhagwantmann

Bhagwantmann

ప్రధాని మోడీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి వచ్చారు. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా మోడీ పర్యటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశాన్ని వదిలేసి.. కేవలం 10 వేల మంది ఉన్న దేశాల్లో మోడీ పర్యటించడం ఆశ్చర్యం కలిగిస్తోందని విమర్శించారు. మోడీ ఏఏ దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలన్నారు. 140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశంలో ఉండరు కానీ.. 10 వేల మంది కూడా ఉండని దేశాలకు మాత్రం వెళ్తుంటారని వ్యాఖ్యానించారు. పైగా అక్కడ అత్యున్నత పురస్కారాలు కూడా అందుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Houthi Rebels: హౌతీ రెబల్స్ చెరలో ఎటర్నిల్ సీ సిబ్బంది..

భగవంత్ మాన్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ విదేశీ పర్యటనలపై రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవిగా ఉన్నాయని తెలిపింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం ఏ మాత్రం సబబు కాదని సూచించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మాటలు రావడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రారంభం.. iPad, టాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్ ఇదిగో..!

ప్రధాని మోడీ జూలై 2న ఐదు దేశాల పర్యటనకు వెళ్లారు. ఘనా, ట్రినిడాడ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా దేశాల్లో పర్యటించారు. 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు.

Exit mobile version