Site icon NTV Telugu

Punjab: హర్భజన్‌కు ఆప్ బంపర్ ఆఫర్.. రాజ్యసభ ఎంపీగా అవకాశం?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్ల ప్రకారం తాజాగా ఆప్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో హర్భజన్‌ను పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పంజాబ్‌లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేలా భజ్జీకి మరో కీలక బాధ్యత కూడా అప్పజెప్పాలని ఆప్‌ యోచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని ఆప్ సర్కారు భావిస్తోంది. ఎందుకంటే ఆప్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. దీంతో ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో ఆప్‌కు ఓట్లు వేసి గెలిపించారు.

Exit mobile version