Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు.. లా విద్యార్థిని అరెస్ట్

Operationsindoor

Operationsindoor

సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పేరు ప్రఖ్యాతల కోసమో తెలియదు గానీ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ మధ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టై జైల్లో ఊచలు లెక్కడుతోంది. తాజాగా లా విద్యార్థిని తన స్థాయి మరిచి ప్రవర్తించింది. దీంతో ఆమె  కూడా ఇరాటకంలో పడింది.

ఇది కూడా చదవండి: Baloch Liberation Army: పాకిస్తాన్‌కి షాక్.. కీలకమైన నగరాన్ని చేజిక్కించుకున్న బీఎల్ఏ..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌పై అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పూణెకు చెందిన లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక మతాన్ని లక్ష్యంగా చూసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై పశ్చిమబెంగాల్‌లో కేసు నమోదైంది. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు కోల్‌కతా పోలీసులు పూణెకు వచ్చారు. కానీ కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో ఆమె కోసం గాలిస్తుండగా శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో పట్టుబడింది.

ఇది కూడా చదవండి: Disha Patani: హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న కల్కి బ్యూటీ

ఆపరేషన్ సిందూర్‌పై ఒక పోస్టుకు ప్రత్యుత్తరం ఇస్తూ శర్మిష్ఠ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్ నటులు నోరు ఎందుకు విప్పడం లేదని నిలదీస్తూ.. వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఆమెకు నోటీసు ఇచ్చేందుకు పోలీసులు విఫలయత్నం అయ్యారు. దీంతో ఆమెకు కోల్‌కతాలోని అలీపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. శనివారం శర్మిష్ఠను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిచింది.

ఒక మతాన్ని కించపరిచే విధంగా శర్మిష్ఠ అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని పోలీసులు తెలిపారు. వారి మతం యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఇదిలా ఉంటే శర్మిష్ఠకు సంబంధించిన వీడియో వివాదాస్పదం కావడంతో వెంటనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. ఈ మేరకు క్షమాపణలు కూడా చెప్పింది. వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరింది. ఇకపై పబ్లిక్‌ పోస్టులో జాగ్రత్తగా ఉంటానని.. దయచేసి ఈసారికి క్షమించాలని శర్మిష్ఠ విజ్ఞప్తి చేసింది.

 

Exit mobile version