Kerala: కేరళలో సంచలనం సృష్టించిన హోటల్ యజమాని హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెక్స్ స్కాండర్, హనీట్రాప్ ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కోజికోడ్ కు చెందిన వ్యాపారి హత్య కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నిందితులు శిబిలి, ఫర్హానా, ఆషిక్ లు ముగ్గురు 58 ఏళ్ సిద్ధిక్ ను హనీట్రాప్ చేసేందుకు కుట్ర చేశారు. అయితే మే 18న ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో మలప్పురం జిల్లాలో ఎరన్హిపాలెంలో హత్య చేశారు.
Read Also: Breach Candy Hospital : ముంబైలో ఘోరం.. 14అంతస్తుల ఆస్పత్రి భవనంలో మంటలు
ముగ్గురు నిందితులు కలిసి సిద్ధిక్ ను బలవంతంగా బట్టలు విప్పించి, అతని నగ్న ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో గొడవ జరిగింది. గోడవ సమయంలో ఫర్హానా, శిబిలికి సుత్తె అందించింది. దాంతో అతడు సిద్ధిక్ తలపై కొట్టాడు. ఆ తరువాత ఆషిక్ కూడా బాధితుడిపై దాడి చేశాడు. తీవ్రగాయాలతో సిద్ధిక్ మరణించాడు. ఈ వివరాలను మలప్పురం జిల్లా ఎస్పీ ఎస్ సుజిత్ దాస్ మీడియాకు వెల్లడించారు.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కట్టర్ సాయంతో రెండుగా నరికి, బ్యాగులో పెట్టుకుని అట్టప్పాడి ఘాట్ రోడ్డు వద్ద విసిరేశారు నిందితులు. సిద్ధిక్ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్లు తెలిసిన శిబిలి హత్య తర్వాత ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు. మే 24న నిందితులను చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు. అస్సాంకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్న సమయంలో కేరళ పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు. కోజికోడ్ లో ఒలవన్న లో రెస్టారెంట్ నడుపుతున్న తిరూర్ కు చెంది సిద్ధిక్ మృతదేహాన్ని అట్టప్పాడి రోడ్డులో ఒక కొండ వద్ద రెండు ట్రాలీ బ్యాగుల్లో పోలీసులు శుక్రవారం గుర్తించారు.