Site icon NTV Telugu

Priyanka Gandhi Son: ప్రియురాలితో ప్రియాంకాగాంధీ కుమారుడు నిశ్చితార్థం! కోడలు ఎవరంటే..!

Priyanka Gandhi Son

Priyanka Gandhi Son

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా(25).. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌‌తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్‌కు పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పడంతోనే ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అవివా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.

రైహాన్ వాద్రా…
రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు (Visual Artist), వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్‌, కమర్షియల్‌ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులోనే కెమెరా చేతపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతగానో ప్రోత్సహించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్‌ హౌస్‌లో ‘డార్క్‌ పర్సెప్షన్‌’ పేరుతో తొలి ఎగ్జిబిషన్‌ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. ఇక 2017లో పాఠశాల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రైహాన్ వాద్రా కంటికి గాయమైంది.

Exit mobile version