కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించింది యాజమాన్యం. స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠశాలలోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా లోపలికి దించి మరీ ట్యాంక్‌ను కడిగించారు.
Also Read: Joe Biden: అమెరికాలో కలకలం.. బైడెన్ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అదే స్కూల్‌కు చెందిన ఓ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించడంపై స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు, హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్, ఓ టీచర్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానమి ఆయన పేర్కొన్నారు.
Also Read: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం