NTV Telugu Site icon

PM Modi: దేశ ప్రజలకు మోడీ శివరాత్రి శుభాకాంక్షలు.. వీడియోలో భక్తి టీవీ కోటి దీపోత్సవం

Modi

Modi

దేశ ప్రజలకు ప్రధాని మోడీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ప్రత్యేక వీడియోను మోడీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని చూపించారు. ఏడాదిన్నర క్రితం భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. నాటి కోటి దీపోత్సవం ప్రాంగణాన్ని కాశీవిశ్వేశరుడి ఆలయంతో ప్రధాని పోల్చారు. ఇక దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని.. మంచి ఆరోగ్యం దయ చేయాలని.. అభివృద్ధి చెందిన భారత దేశంగా రూపొందేందుకు శక్తినివ్వాలని శివుడిని వేడుకున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీకి వరుస షాక్‌లు.. మరో మూడు కేసులు నమోదు

ఇక దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఇక గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళా బుధవారం ముగుస్తోంది. చివరి రోజు కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి… పుణ్యస్నానాలు ఆచరిస్తు్న్నారు.