Site icon NTV Telugu

PM Narendra Modi: కేదార్‌నాథ్ పర్యటనకు పీఎం మోదీ..

Kedarnath

Kedarnath

Prime Minister Modi will visit Kedarnath: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్ నాథ్ పర్యటనకు ఉత్తరాఖండ్ వెళ్లనున్నారు. రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి మోదీ కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించనున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కేదార్ నాథ్ ఆలయంలో ప్రార్థనలు, పూజలు చేయనున్నారు. కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Read Also: Ktr road show in Munugode: నేడు మునుగోడుకుమంత్రి కేటీఆర్‌.. మధ్యాహ్నం రోడ్‌ షో

ఆదిశంకారాచార్య సమాధి స్థలాన్ని సందర్శించి, మందాకిని అస్తపథం, సరస్వతీ అస్తపథం వెంబడి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. కేదార్ నాథ్ సందర్శన అనంతరం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11.30లకు ప్రధాని బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడ నిర్మాణ కార్మికులతో సందర్శించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని రుద్రప్రయాగ్ కలెక్టర్ దీక్షిత్ తెలిపారు.

ఇదిలా ఉంటే కేధార్ నాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో దట్టంగా మంచుకురుస్తోంది. దీంతో ప్రధాని మోదీ సందర్శన కోసం మరిన్ని ఏర్పాట్లను చేయాల్సి వస్తోంది. ఉత్తరాఖండ్ పర్యటన అనంతరం అక్టోబర్ 23న అయోధ్యలోని రామమందిర నిర్మాణాలను పరిశీలించనున్నారు ప్రధాని మోదీ. అక్కడే ప్రార్థనలు చేయనున్నారు. సరయూ నది ఒడ్డున సాయంత్ర జరిగే ఆరతి, దీపోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. రామ్ కీ పైరీపై దీపాలను వెలిగించనున్నారు.

Exit mobile version