Site icon NTV Telugu

PM Modi: ప్రయాగ్‌రాజ్‌లో 140 కోట్ల ప్రజల విశ్వాసం గెలిచింది

Modi

Modi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ ఉత్సవం ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 26తో విజయవంతంగా ముగిసింది. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘మహా కుంభమేళా పూర్తయింది. ఐక్యత మహా యజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది.’’ అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Anaganaga OkaRaju : అక్కడ ‘అనగనగా’ షూటింగ్.. రిలీజ్ ఎప్పుడనగా.?

మహా కుంభమేళాకు దాదాపు దేశ, విదేశాల నుంచి దాదాపు 63 కోట్లకు పైగా భక్తులు వచ్చి త్రివేణి సంగంలో పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం యోగి ప్రభుత్వం ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక టెంట్లు, టాయిలెట్లు, సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు ప్రాణాలు కొల్పోయారు. అలాగే నూఢిల్లీ రైల్వే్స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కూడా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా సమయాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో కూడా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపా: జోగిమణి

 

Exit mobile version