Site icon NTV Telugu

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులను ప్రధాని మోడీ శనివారం విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోడీ నిధులను విడుదల చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం ఫండ్ నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లకు పైగా సమ్మన్ నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేశారు.

Read Also:హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్‌ ప్రారంభం

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8శాతానికిపైగా ఉందని.. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు భారత్‌కు వస్తున్నాయన్నారు. 2021లో కేవలం యూపీఐ ద్వారానే రూ.70 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు.

Exit mobile version