Site icon NTV Telugu

భారత క్రీడాకారులకు ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల ప్రదానం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం సాయంత్రం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరచినవారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఖేల్ రత్న అవార్డులు తీసుకున్నవారి జాబితాలో మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవి కుమార్, బాక్సర్ లొవ్లీనా బోర్గోహాయిన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పీఆర్, పారా షూటర్ అవని లేఖరా, పారా అథ్లెట్ సుమిత్ అంతిల్ ఉన్నారు.

Read Also: వాట్సాప్‌లో ఈ మెసేజ్ వస్తే ..అసలు నమ్మొద్దు ప్లీజ్‌!

అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారులు: శిఖర్ ధావన్ (క్రికెట్), నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ). కాగా కేంద్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత స్థాయి క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న. క్రీడారంగంలో నాలుగేళ్లకు పైగా సత్తా చాటిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. విజేతలకు ట్రోఫీ, సైటేషన్, నగదు బహుమతులను అందజేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఎప్పటికప్పుడు Ntv లేటెస్ట్ వార్తలు, ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం ట్విట‌ర్ పేజీని ఫాలో అవ్వండి

Exit mobile version