NTV Telugu Site icon

Delhi High Court: గర్భిణీగా ఉండటం అనారోగ్యం కాదు.. ఆమెకు ఉద్యోగాన్ని తిరస్కరించలేరు..

Pregnent Women

Pregnent Women

Delhi High Court: గర్భం దాల్చడం అనారోగ్యం లేదా అంగవైకల్యం కానది ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సాకుతో మహిళలకు ప్రభుత్వాలను నిరాకరించరాదని కోర్టు పేర్కంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ)ని ఆలస్యం చేయాలంటూ ఓ గర్భిణి చేసిన అభ్యర్థనను తిరస్కరించినందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)ని కోర్టు విమర్శించింది. న్యాయమూర్తులు రేఖా పల్లి, శాలిందర్ కౌర్ ఈ కేసులో ఆర్‌పీఎఫ్, కేంద్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ‘‘మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను తిరస్కరించడానికి మాతృత్వం ఎప్పటికీ ఆధారం కాకూడదు’’ అని పేర్కొన్నారు.

Read Also: EX MP Harsha Kumar: వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు..

గర్భిణీ స్త్రీల ఉపాధి హక్కు కోసం వసతి కల్పించి, నియమించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆర్‌పీఎఫ్‌ని ఆదేశించింది. మహిళ తన గర్భం కారణంగా హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్ చేయలేదని ఆర్‌పీఎఫ్‌కి వివరించింది. ఆమె అభ్యర్థనని స్వీకరించడానికి బదులుగా, ఆర్‌పీఎఫ్ ఆమె పరిస్థితిని అనర్హతగా పరిగణించింది. ఈ అంశాన్ని మహిళ కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ కేసులో ఆరు వారాల్లో మహిళ పరీక్షలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆర్‌పీఎఫ్‌ని కోర్టు ఆదేశించింది. ఆమె అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే రెట్రోస్పెక్టివ్ సీనియారిటీ, ఇతర ప్రయోజనాలతో కానిస్టేబుల్‌గా నియమించాలని చెప్పింది. మహిళ పిటిషన్ దాఖలు చేసిన ఐదేళ్ల తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

గర్భం అనేది ఉద్యోగానికి అడ్డంకి కాకూడదని పేర్కొంటూనే దేశానికి సహకరించాలనుకునే మహిళలకు అధికారులు మద్దతు ఇవ్వాలని కోర్టు హైలెట్ చేసింది. మహిళలు అన్యాయమైన అడ్డంకులను ఎదుర్కోకుండా తమ కెరీర్‌ను కొనసాగించే సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, గర్భం ఆధారంగా మహిళలకు ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని కోర్టు విమర్శించింది.