NTV Telugu Site icon

Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన

Pralhad Joshi

Pralhad Joshi

Pralhad Joshi On Population Surged Due To Lack Of Electricity: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక వింత ప్రకటన చేశారు. కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగిందంటూ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ఆయన ఆ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గురువారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రహ్లాద్ మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. వాళ్లు ఉచితంగా కరెంటు ఇస్తారని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ తన హయాంలో సరిగ్గా కరెంటు సరఫరా చేయలేకపోయింది. ముఖ్యంగా గ్రామాలైతే అంధకారంలోనే ఉండేవి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండటం వల్లే మన దేశ జనాభా పెరిగిపోయింది. కానీ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము (బీజేపీ) 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయగలుగుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రహ్లాద్ జోషీ కరెంట్ కోతల విషయంలో కాంగ్రెస్‌ని విమర్శించడం వరకు బాగానే ఉంది కానీ, దేశ జనాభాతో దాన్ని లింక్ చేయడమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోని తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.

Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు

కాగా.. కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు.. విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకు దిగారు. ఆయా హామీలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని మాటిచ్చింది. దీనిపై కౌంటర్ వేయబోతూ.. ప్రహ్లాద్ జోషి పై విధంగా స్పందించారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు కరెంట్ కోతలకి, జనాభా పెరుగుదలకి సంబంధం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ 24 గంటలు కరెంట్ ఉంటే, జనాభా పెరగదా? పిల్లలు పుట్టరా? అని నిలదీస్తున్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రహ్లాద్ వ్యాఖ్యలు మరింత జుగుస్పాకరంగా ఉన్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.

Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

Show comments