మిషన్ భగీరథ పథకంపై మరోసారి కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఛత్తీస్ ఘఢ్ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మిషన్ భగీరథ పథకం గురించి ప్రస్తావించారు. దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని..తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి అభినందించారు కేంద్ర మంత్రి. దేశంలో ప్రతి ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని ఇవ్వాలనే లక్ష్యానికి చేరువ అయ్యామని కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. దేశంలో ప్రతి ఇంటికీ మంచినీరు అనే విజన్ త్వరలోనే నిజం కాబోతుందని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ తరహాలోనే వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన గోవా అని తెలిపారు గజేంద్ర సింగ్ షెకావత్.
మిషన్ భగీరథ పథకానికి మరోసారి ప్రశంసలు
