NTV Telugu Site icon

Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..

Election Commission

Election Commission

Election Commission: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయిన అమిత్ షా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు, సోమవారం లోగా తమ రెస్పాన్స్ తెలియజేయాలని ఆదేశించింది.

Read Also: US-Iran: ట్రంప్‌ని చంపడానికి ప్రయత్నించబోం.. అమెరికాకు ఇరాన్ హామీ..

నవంబర్ 06న ముంబైలో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘మహారాష్ట్ర నుంచి అవకాశాలను, పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టారు’’ అని అన్నారు. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ‘‘ రాహుల్ గాంధీ తన ప్రకటనతో మహారాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారు. ఇది జాతి ఐక్యత, సమగ్రతకు ప్రమాదకరం. ఆయన ప్రసంగం అబద్ధాలతో నిండి ఉంది. మహరాష్ట్ర గుజరాత్, ఇతర రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, శత్రుత్వం సృ‌ష్టించేందుకు ప్రయత్నించారు.’’ అని నవంబర్ 11న ఈసీ ఎదుట బీజేపీ కంప్లైంట్ చేసింది.

నవంబర్ 12న జార్ఖండ్ ధన్‌బాద్‌లో అమిత్ షా మాట్లాడుతూ… కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, దురుద్దేశపూరిత ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ‘‘ అమిత్ షా తన ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని యోచిస్తోందని ఆరోపించారు. ’’ ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నవంబర్ 13న కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Show comments