దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఈనెల 10న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి.
ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో భాగంగా మిఠాయిలు పంచుకోవడం మాములే. దీంతో విజయంపై ధీమాతో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్ల తయారీదారులకు చేతినిండా పని లభించింది. క్షణం తీరిక లేకుండా లడ్డూల తయారీలో సతమతమవుతున్నారు. వారు భారీ సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు.
కాగా ఇటీవల పలు ఎగ్జిట్ పోల్స్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని నివేదికలు ఇచ్చాయి. మొత్తం 117 స్థానాలకు ఆప్ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టుడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఏబీపీ-సీ ఓటర్ మాత్రం ఆప్ 57, కాంగ్రెస్ 26, అకాలీదళ్ 24, బీజేపీ 10 గెలుచుకుంటుందని వెల్లడించింది. కానీ గెలుపు ఎవరిదో ఈనెల 10న స్పష్టం కానుంది.
Ludhiana | Political parties in Punjab ordering laddoos before the results of Punjab Assembly elections
— ANI (@ANI) March 8, 2022
The counting of votes will be done on March 10th. pic.twitter.com/yIRhLbnCIB
