గుడి అన్నాక గంటలు మోగడం సహజం. హిందూ దేవాలయాల్లో గుడికి వచ్చిన భక్తులు గంట కొట్టి దణ్ణం పెట్టుకొని వెళ్తారు. అయితే, గుడిలో గంటల మోత అధికంగా ఉందని, గంటల కారణంగా శబ్దకాలుష్యం పెరిగిపోతున్నదని, గంటల శబ్దాన్ని పరిధిమేరకు అదుపులో ఉంచకపోతే శబ్దకాలుష్యచట్టం 2000, పర్యావరణ కాలుష్య చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు ఆలయ పూజారులకు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో దొడ్డగణపతి ఆలయం అంటే తెలియని వారు ఉండరు. ఈ దేవాలయానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోనే గణపతి ఆలయంతో పాటు ఆంజనేయ ఆలయం, దొడ్డ బసవన్న ఆలయం కూడా ఉన్నాయి. ఆలయం అన్న తరువాత గంటల మోత మోగకుండా ఎలా ఉంటుందని పూజారులు ప్రశ్నిస్తున్నారు.
Read: Marriage: ఆయనకు 14 మంది భార్యలు… ఏడు రాష్ట్రాలకు అల్లుడు…
