Site icon NTV Telugu

Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!

Delhi Car Blast8

Delhi Car Blast8

ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తాజాగా బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Stock Market: బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

ఫరీదాబాద్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టాయి. ఎర్రకోట దగ్గర జరిగిన దాడి దీపావళి నాడు ప్లాన్ చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి నాడు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశామని.. అనంతరం ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లుగా ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ ప్లాన్‌ను జనవరి 26, 2026న అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. ఇందులో భాగంగానే ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతాలను గుర్తించినట్లుగా ముజమ్మిల్ పోలీసులకు తెలియజేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. సామవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ పేలుడులో 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా ఎలా మారింది? డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!

Exit mobile version