NTV Telugu Site icon

Punjab: శంభు సరిహద్దులో రైతుల దీక్ష భగ్నం.. అన్నదాతల అరెస్ట్

Punjab Shambhu Border

Punjab Shambhu Border

హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దులో ఉద్రిక్త చోటుచేసుకుంది. వివిధ డిమాండ్లతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి హర్యానా పోలీసులు.. రైతుల ఆందోళనను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు. అనంతరం కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించారు. ఏడాది నుంచి శంభు-ఖనౌరి సరిహద్దు మూసివేసి ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం కేంద్ర ప్రతినిధి బృందంతో సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్న రైతు నాయకులు సర్వాన్ సింగ్ పాంధేర్, జగ్జిత్ సింగ్ దల్లెవాల్ సహా కీలక నేతలను మొహాలిలో అరెస్ట్ చేశారు. అనంతరం నిరసన తెలుపుతున్న ప్రాంతం నుంచి రైతులను ఖాళీ చేయించారు.

ఇది కూడా చదవండి: Fire Accident : PVNR ఎక్స్‌ప్రెస్ వే పై కారు దగ్ధం

దీర్ఘకాలంగా రహదారులు మూసివేయడం వల్ల పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ అన్నారు. రైతులను తరలించడాన్ని ఆయన సమర్థించారు. ఆప్ ప్రభుత్వం యువతకు ఉపాధిని కల్పించడానికి కట్టుబడి ఉందన్నారు. వాణిజ్యం మరియు పరిశ్రమలు సజావుగా కొనసాగితే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: NKR 21 : అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది

సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలోని నిరసనకారులు గత సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్-హర్యానా మధ్య శంభు, ఖానౌరి సరిహద్దు పాయింట్ల దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి పాదయాత్రకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అక్కడే మకాం వేశారు. తాజాగా నిరసన స్థలాన్ని ధ్వంసం చేశారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లకు మద్దతుగా నిరసన తెలుపుతున్నారు. బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. తిరిగి వస్తుండగా రైతు నాయకులను అరెస్ట్ చేశారు.