Site icon NTV Telugu

Rahul Gandhi: లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ రాహుల్ గాంధీ.. ఒడియా నటుడి వివాదాస్పద పోస్ట్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఒడియా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన కారణంగా బుద్దాదిత్యపై కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్‌యూఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ శుక్రవారం క్యాపిటల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుద్ధాదిత్య సోషల్ మీడియా పోస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Haryana: 45 మంది చిన్నారులతో లోయలో పడ్డ స్కూల్ బస్సు.. రంగంలోకి దిగిన యంత్రాంగం

బుద్ధాదిత్య తన సోషల్ మీడియా పోస్టులో.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని చంపిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తదుపరి లక్ష్యం రాహుల్ గాంధీ అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. మా నాయకుడిపై ఇలాంటి వ్యాక్యలు సహించలేమని అన్నారు.

కాంగ్రెస్ విద్యార్థి నేతలు ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్ షాట్‌ని పోలీసులకు అందించారు. ఫిర్యాదుని స్వీకరించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్టు వివాదాస్పదం కావడంతో బుద్ధాదిత్య మొహంతి క్షమాపణలు కోరారు. ‘‘రాహుల్ గాంధీజీకి సంబంధించి నా చివరిపోస్ట్, ఆయనను లక్ష్యంగా చేసుకోలేదు. ఆయనకు ఏ విధంగా హాని చేయడం, కించపరచడం లేదా అతడికి వ్యతిరేకంగా ఏమీ రాయలేదు. అనుకోకుండా నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే నా హృదయపూర్వక క్షమాపణలు’’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

Exit mobile version