Site icon NTV Telugu

Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ

Jobs

Jobs

దేశవ్యాప్తంగా ఉద్యోగం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ అందించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల స్థితిగతులపై మంగళవారం నాడు ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ మేరకు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ మోదీ సర్కారు ఉద్యోగాల భర్తీపై తాజాగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు త్వరలోనే ఆయా శాఖల నుంచి నోటిఫికేషన్‌లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల ఖాళీలను అధికారులు భర్తీ చేయనున్నారు. అయితే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version