Site icon NTV Telugu

PM Narendra Modi: కేసుల పరిష్కారానికి కొత్త విధానం.. వర్చువల్ కోర్టులు

Pm Modi, Nv Ramana

Pm Modi, Nv Ramana

PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విధంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రైయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని న్యాయమూర్తులను ఆయన కోరారు. ఇందుకోసం న్యాయమూర్తులు తమ కార్యాలయాలను జిల్లా స్థాయి అండర్ ట్రయర్ రివ్యూ కమిటీలుగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. జల్లా న్యాయ సేవల అధికారులు అండర్ ట్రయల్ న్యాయ సహాయం అందించే బాధ్యతలు తీసుకోవచ్చని ఆయన అన్నారు.

గత ఎనిమిదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని న్యాయపరమైన మౌళిక సదుపాయాలను మెరుగుపరచడానికి వేగంగా పనిచేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ-కోర్టుల మిషన్ కింద ఇండియాలో వర్చువల్ కోర్టులు ప్రారంభం అవుతున్నాయిని ఆయన అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంతటి నేరాల కోసం 24 గంటలు కోర్టులు పనిచేయడం ప్రారంభించాయని అన్నాను.

Read Also: Harassed By Instant Loan Apps, Defaulter Ends Life : లోన్ ఇచ్చి ప్రాణం తీస్తారా ? లోన్ యాప్ దారుణాలకు అంతం లేదా ?

ఈ సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రపంచం యువతలో 1/5 వంతు భారత్ లో నివసిస్తున్నారని.. నిజమైన బలం యువతలోనే ఉందని అన్నారు. అయితే నైపుణ్యం కలిగిన కార్మికులు మన శ్రామిక శక్తిలో కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. మన దేశ నైపుణ్య శక్తిని మనం ఉపయోగించుకోవాలని సూచించారు. న్యాయం పొందడం అనేది సామాజిక విముక్తికి ఓ సాధనం అని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా జ్యుడిషియల్ అధికారులే ప్రజలకు మొదటి పరిచయస్తులని.. జిల్లా న్యాయవ్యవస్థపై ప్రజలకు అందించే సహాయసహకారాలపైనే ప్రజాభిప్రాయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.న్యాయాన్ని ప్రజల గడపకు చేర్చేలా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అన్నారు.

Exit mobile version