Cable Bridge Collapse: ఆ బాధ వర్ణనాతీతం.. వంతెన ఘటనపై మోడీ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi About Gujarat Cable Bridge Incident: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని ఎంతో బాధించిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా ప్రతిమ వద్ద మోడీ నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘నేను కేవడియాలో ఉన్నప్పటికీ, నా ఆలోచనంతా మోర్బీ ఘటన మీదే ఉంది. నేను ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా అరుదు. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ఉండటంతో బాధితుల్ని పరామర్శించే అవకాశం దొరకలేదు’’ అని మోడీ పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే తాను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడానని, ఆయన మోర్బీకి చేరుకున్నారని మోడీ తెలిపారు. సహాయక చర్యలను సీఎం దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని హామీ ఇస్తున్నానని చెప్పిన మోడీ.. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. ఈ కష్ట సమయాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడినవారికి తక్షణ వైద్యం అందేలా చూస్తున్నామని మోడీ విచారం వ్యక్తం చేశారు. సవాళ్లను ఎదుర్కొంటూనే.. తన పనిని కొనసాగించిన విషయంలో పటేల్ ఆదర్శమని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ ఘటనపై నిన్న రాత్రే బాధిత కుటుంబాలకు మోడీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే! మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇదిలావుండగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 132 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలామంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 177 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. బృందాలు ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ, నది ఒడ్డుకు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!