Site icon NTV Telugu

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు.. ఏపీ సహా ఆ రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు!

Ashwin

Ashwin

ఈ రోజు (ఆగస్టు 12న) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్‌ ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య 10కి చేరిందని చెప్పాలి. కాగా, 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా వ్యవహరించబోతున్నాయి.

Read Also: Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు

ఇక, ఎలక్ట్రానిక్‌ తయారీ ఎకోసిస్టమ్‌కు ఉత్ప్రేరకంగా మరి, అనేక ఉద్యోగాల కల్పనకు సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్‌ ఉపయోగపడుతుంది. టెలికాం, డేటా సెంటర్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో సెమీ కండక్టర్లకు మరింత డిమాండ్ పెరుగుతుండటంతో.. కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో కీలకపాత్ర పోషించబోతున్నాయి. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇవి పెద్ద మైలురాయిగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.

Read Also: Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?

అయితే, దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పంజాబ్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలియజేశారు. అలాగే, పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో ఫేజ్‌ 1బీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని రూ.5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 700 మెగా వాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టుకు మోడీ కేబినెట్ లో ఆమోదం లభించింది.

Exit mobile version