Site icon NTV Telugu

PM Modi: ఆగస్టు 23 వరకు మీ సలహాలు, సూచనలు పంపండి..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

Modi

Modi

PM Modi: 124వ మన్‌కీ బాత్‌ కార్యక్రమం ఈరోజు (జూలై 27న) జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపించాలని కోరారు. ఇందుకు నమో యాప్‌ను ఉపయోగించుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని ఈ సందర్భంగా మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: BTech Ravi: ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు?.. సతీష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్!

అయితే, ఇటీవల కాలంలో భారత్‌లో అనేక విశేషాలు జరిగాయి.. అవన్నీ ప్రతి ఇండియన్ కీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు. శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశ ప్రజల హృదయం గర్వంతో నిండిపోయిందన్నారు. చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేశాం.. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్‌ సైన్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌.. పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమం అన్నారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయబోతున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: KTR Birthday: కేటీఆర్ జన్మదిన వేడుకలు.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ సస్పెండ్!

ఇక, ప్రతి విద్యార్థి సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తారని.. ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది స్టూడెంట్స్ చేరారని ప్రధాని మోడీ చెప్పారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవి.. కానీ, ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి.. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటాం.. దీన్ని ఎలా జరుపుకుంటారు? అనేదానిపై తమ సలహాలు, సూచనలను నమో యాప్‌ ద్వారా తనకు తెలియజేయాలని నరేంద్ర మోడీ కోరారు.

Exit mobile version