Site icon NTV Telugu

PM Modi: నేడు అహ్మదాబాద్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

Modi

Modi

ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఆగస్టు 25న ఖోడల్ధామ్ మైదానంలో మోడీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నికోల్‌లో రోడ్లను మూసివేసి దారి మళ్లించారు.

ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!

ఇక పర్యటనలో భాగంగా గుజరాత్‌లో రైల్వేలు, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధికి సంబంధించిన రూ.5,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. బహుళ ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఆగస్టు 26న సుజుకి హన్సల్‌పూర్ ప్లాంట్‌ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇక సుజుకి ‘‘e VITARA’’ ఎగుమతులను 100 దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఇది కూడా చదవండి:Bulandshahr Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. 8 మంది మృతి

రూ.1,400 కోట్ల విలువైన రైల్వే అప్‌గ్రేడ్‌లు, రూ.1,000 కోట్ల విలువైన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు, రోడ్డు కనెక్టివిటీ చొరవలు, మురికివాడల పునరాభివృద్ధి, గాంధీనగర్‌లో రాష్ట్ర స్థాయి డేటా సెంటర్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించనున్నారు.

Exit mobile version