Site icon NTV Telugu

PM Modi Trolled: సీటు బెల్టు వివాదంలో ప్రధాని మోడీ.. నెట్టింట ట్రోలింగ్

Modi

Modi

PM Modi Trolled: బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ భారత పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మొద‌టి రోజు ముంబైలో సంద‌డి చేసిన స్టార్మర్ ఆ తర్వాత భార‌త‌ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇక, ఈ మీటింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దీనికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందులో యూకే పీఎం కీర్ స్టార్మర్ సీట్ బెల్ట్ పెట్టుకుని కనిపిస్తుండగా.. న‌రేంద్ర మోడీ మాత్రం సీట్ బెల్ట్ లేకుండానే ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. అయితే, ఈ విష‌యంపై నెటిజ‌న్లు మోడీపై తీవ్రంగా మండిపడుతున్నారు. పోరుగు దేశం ప్రధాని మ‌న దేశానికి వ‌చ్చి మరీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే, మ‌న దేశ పీఎం మాత్రం నిబంధనలు పాటించ‌కుండా ఫొటోల‌కు ఫోజులు ఇస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: Vemulawada Temple: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూలు..

మ‌రోవైపు, రోడ్డు భద్రతా నిబంధనలను దేశ ప్రధాన మంత్రినే పాటించ‌కపోతే సాధారణ పౌరులు ఎలా పాటిస్తారంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతుంది. ఇక, భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రశంసించారు. భారత్‌ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వెల్లడించారు. 2028 నాటికి భారత్‌ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే ఛాన్స్ ఉందని తెలిపారు.

Exit mobile version