Site icon NTV Telugu

PM Modi: సంక్రాంతి రోజు కొత్త ఆఫీసులోకి ప్రధాని మోడీ..

Pmmodi2

Pmmodi2

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త కార్యాలయం(పీఎంఓ) దాదాపుగా సిద్ధమైంది. మకర సంక్రాంతి రోజు ఆయన ‘‘సేవాతీర్థ్’’ కాంప్లెక్స్‌కు మారే అవకాశం ఉంది. జనవరి 14న పండగ రోజు మార్పు జరగాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో పీఓంఓ, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రరేటియట్ ఉండేలా రూపొందించారు. ఈ మూడింటికి వేర్వేరు భవనాలను కేటాయించారు. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సౌత్ బ్లాక్‌లోనే ఉన్న పీఎంఓ కార్యాలయం తొలిసారిగా మరే ప్రాంతానికి మారుస్తున్నారు. పాత కార్యాలయం ఖాళీ అయిన తర్వాత సౌత్, నార్త్ బ్లాక్‌లను ‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’ అనే పబ్లిక్ మ్యూజియంగా మార్చనున్నారు.

Read Also: iPhone Users Alert: ఐఫోన్‌ యూజర్లకు వార్నింగ్‌.. వెంటనే ఈ ఒక్క పని చేయండి.. లేదంటే ఫోన్‌ హ్యాకే..!

కొత్త కార్యాలయం రైసినా హిల్ సమీపంలో ఉంది. దీనిని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. నిర్మాణ దశలో దీనిని ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌గా పిలిచారు. ఇటీవల దీనికి ‘సేవాతీర్థ్’ అని పేరు పెట్టారు. సేవాతీర్థ్-1లో ప్రధాని కార్యాలయం, సేవా తీర్థ్ 2లో క్యాబినెట్ సెక్రటేరియట్ మరియు సేవా తీర్థ్ 3లో జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం ఉన్నాయి. కొత్త కార్యాలయం సమీపంలోనే ప్రధాని నివాసాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడా దాదాపుగా సిద్ధమైంది. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని నివాసం నుంచి కొత్త నివాసానికి ప్రధాని మారుతారు.

Exit mobile version