NTV Telugu Site icon

PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి ఉండగా.. అవి, తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్‌కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.

Read Also: Israeli Strike : గాజాలో వైద్య సహాయం తీసుకువెళుతున్న కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి

అయితే, దక్షిణ రైల్వే జోన్‌లో నడవనున్న మూడు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20627/20628) రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునెల్వేలితో పాటు నాగర్‌కోయిల్ జంక్షన్‌లలో ఈ రైలు ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటుంది. చైర్ కార్ ధర రూ. 1,760 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,240. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఈ ప్రైస్ ఉంటుంది.

Read Also: Off The Record : జంపింగ్స్తో వైసీపీ ఉక్కిరి బిక్కిరి

ఇదిలా ఉండగా మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20671/20672) రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు తన సేవలను అందిస్తుంది. ఇది దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాజపురంలలో ఆగుతుంది. దక్షిణ రైల్వే షెడ్యూల్ ప్రకారం.. రైలు మదురై జంక్షన్ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఒక చైర్ కార్ ధర రూ. 1,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2,865. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఉంటుంది.