PM Modi: స్వీడన్‌లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్

  • ప్రధాని మోడీకి స్వీడన్ ఘన స్వాగతం..
  • గ్రిపెన్ యుద్ధ విమానాలతో ఎస్కార్ట్..
  • స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్వీడిష్ ప్రధాని..
Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన 5 దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం స్వీడన్ చేరుకున్నారు. నెదర్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే ఆయన స్వీడన్ వెళ్లారు. ప్రధాని మోడీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. ప్రధాని విమానం స్వీడన్ గగనతలంలోకి రాగానే స్వీడిష్ గ్రిపెన్ ఫైటర్ జెట్లు విమానానికి ఎస్కార్ట్‌గా నిలిచాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేకు ప్రధాని మే 17-18 తేదీల్లో స్వీడన్‌లోని గోథెన్ బర్గ్‌లో పర్యటించనున్నారు. స్వీడన్ ప్రధాని ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, ప్రధాని మోడీని స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీకి స్వాగతం పలిచేందుకు ప్రవాసభారతీయలు భారీగా బారులు తీరారు. ఈ పర్యటనలో స్వీడన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. స్వీడన్ ప్రధాని క్రిస్టర్‌సన్‌తో అధికారిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

×
×
Ad