Site icon NTV Telugu

PM Modi: కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

Modi

Modi

ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. సంక్రాంతి పురస్కరించుకుని దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మంగళకరమైన ఈ సంక్రాంతి పండుగ శుభవేళ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అని పోస్ట్ చేశారు.

‘‘సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులకు ఎలా నాంది పలుకుతుందో ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కూడా సరికొత్త ఆశయాలను, ఉన్నతమైన లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మన దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రకరకాల సంప్రదాయాలతో జరుపుకున్నా.. మనందరినీ కలిపి ఉంచే ఆత్మీయత, మనం పంచుకునే ఆనందం మాత్రం ఒక్కటే. మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని, ఏకత్వ స్ఫూర్తిని ఈ సంబరాలు చాటిచెబుతాయి.’’ అని పేర్కొన్నారు.

‘‘ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే మన రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్ర సమయమిది. వారి శ్రమలో భాగస్వామ్యం పంచుకుంటూ సమాజాన్ని సుభిక్షం చేసుకోవడం మనందరి బాధ్యత.ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాలని, మీ భవిష్యత్తు ఎల్లప్పుడూ సానుకూలతతో, ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని, మీ ప్రతి ప్రయత్నం విజయవంతమై సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని మోడీ ఆకాంక్షించారు.

 

Exit mobile version