Site icon NTV Telugu

PM Modi: అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోడీ

Pmmodi

Pmmodi

అన్నదాతలకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ నిధులను విడుదల చేశారు. 0వ విడతలో భాగంగా 9.7 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లకుపైగా నగదును జమ చేశారు. అలాగే రూ. 2,200 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం వంటి బహుళ రంగాలకు ఉపయోగపడనున్నాయి.

ఇది కూడా చదవండి: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాశీకి రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను చంపారని.. దీంతో తన హృదయం దుఃఖంతో నిండిపోయిందన్నారు.. ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశానని.. మహాదేవ్ ఆశీర్వాదంతో అది నెరవేరిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవ్ పాదాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version