Site icon NTV Telugu

కాలభైరవునికి ప్రధాని ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారణాసిలోని కలాభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు ప్రధాని మోడీ.. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇక, అక్కడి నుంచి నేరుగా కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు ప్రారంభించనున్నారు భారత ప్రధాని.. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూమి సేకరించి ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్‌లతో ఆలయాన్ని కలుపుతూ కారిడార్‌ నిర్మాణం జరిగింది.. మరోవైపు.. ఇవాళ నగరమంతా స్వీట్లు పంపిణీ చేపట్టనున్నారు.. 7 లక్షల ఇళ్లలో స్వీట్లు పంపిణీ చేయనున్నారు.. దీని కోసం దాదాపు 16 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు.

Exit mobile version