NTV Telugu Site icon

PM Modi: ఊబకాయంపై యుద్ధం.. 10 మందిని నామినేట్ చేసిన మోడీ

Pmmodi

Pmmodi

దేశంలో ఊబకాయంపై పోరాటం చేసేందుకు ప్రధాని మోడీ సంకల్పించారు. ఆదివారం మన్ కీ బాత్ వేదికగా ఊబకాయంపై పోరాటం చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆహారంలో నూనెల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నందన్ నీలేకని, క్రీడాకారులు మను భాకర్, మీరాబాయి చాను, ఎంపీ మోహన్‌లాల్, సుధా మూర్తి, బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్, నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషల్ వంటి వ్యక్తులను మోడీ నామినేట్ చేశారు. ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఒక్కొక్కరు మరో పది మందిని నామినేట్ చేయాలని ప్రధానమంత్రి కోరారు. ఊబకాయంపై పోరాటంలో తనను నామినేట్ చేయడం పట్ల జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్

‘‘2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా ఆందోళనకర అంశం. ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అది మన బాధ్యత కూడా..! తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం మేర తగ్గించుకోవాలి’’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Longest Bus Route in India: భారతదేశంలో అతి పొడవైన బస్సు ప్రయాణం.. ఏయే రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందంటే ?