NTV Telugu Site icon

PM Modi Ukraine Visit: ఆగస్టు 23న ఉక్రెయిన్‌కి ప్రధాని మోడీ..?

Pm Modi

Pm Modi

PM Modi Ukraine Visit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల మోడీ రష్యాలో పర్యటించారు. ఈ పర్యటనలో మోడీ-పుతిన్ భేటీ జరిగింది. ఇరు దేశాలు అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశాయి. అణుశక్తి మరియు నౌకానిర్మాణం సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

Read Also: Sharad Pawar: ఆయన కేంద్ర హోంమంత్రి కావడం మన దురదృష్టం

ఇదిలా ఉంటే ఆగస్టు 23న ప్రదాని ఉక్రెయిన్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ 7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీని కలిశారు. ఒకవేళ ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఫిక్స్ అయితే, యుద్ధం తర్వాత ఆ దేశంలో మోడీ తొలిసారి పర్యటించినట్లు అవుతుంది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని నివారించేందుకు చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. గతంలో ప్రధాని మోడీ, పుతిన్‌‌తో మాట్లాడుతూ, ఇది యుద్ధాల సమయం కాదని చెప్పారు. యుద్ధాన్ని నివారించేందుకు మార్గాలు అణ్వేషించాలని ఇటీవల తన రష్యా పర్యటనలో కూడా చెప్పుకొచ్చారు.