Site icon NTV Telugu

PM Modi: 2 రోజుల పర్యటన కోసం భూటాన్ వెళ్లిన మోడీ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు వెళ్లారు. నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లోని థింపులో పర్యటించనున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఉత్సాహంగా ఓటేసి.. కొత్త రికార్డ్‌ను సృష్టించండి.. బీహారీయులకు మోడీ పిలుపు

ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇక ఈ పేలుడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాజా వివరాలు అడిగి తెలుసుకుని భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు.

ఇది కూడా చదవండి: Bihar Elections Live Updates: బీహార్‌ రెండో విడత పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్..

 

Exit mobile version