Site icon NTV Telugu

PM Modi: ఎంపీల నివాస సముదాయాన్ని ప్రారంభించిన మోడీ

Modi5

Modi5

ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోడీ ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఇకపై ఎంపీల కొత్త నివాసాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరని.. పనిపై ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అద్దె భవనాల నుంచి పని చేసే మంత్రిత్వ శాఖల అద్దె ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అలాగే ఎంపీలకు కూడా సరైన నివాసాలు లేకపోవడంతో ప్రభుత్వ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయని వెల్లడించారు. నివాసాల కొరత ఉండడంతో 2014 నుంచి 2024 వరకు దాదాపు 350 మంది ఎంపీలకు కొత్త నివాసాలు నిర్మించినట్లు తెలిపారు. తాజాగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనంలో 184 మందికి పైగా ఎంపీలు కలిసి నివాసం ఉండొచ్చని చెప్పారు.

ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!

ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో కొత్త నివాస సముదాయాన్ని నిర్మించారు. టైప్-VIIలో భాగంగా 184 ఫ్లాట్లతో బహుళ అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు. సోమవారం ఈ నివాసాన్ని ప్రారంభించే ముందు ప్రాంగణంలో సింధూర మొక్కను మోడీ నాటారు. అనంతరం కార్మికులతో సంభాషించారు. ప్రతీ ఫ్లాట్ చాలా విశాలంగా నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ భవనం అల్యూమినియం షట్టరింగ్‌తో కూడిన మోనోలిథిక్ కాంక్రీటును ఉపయోగించి నిర్మించారు.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి మిస్సింగ్.. ఆచూకీ కోసం కేంద్రానికి లేఖ

Exit mobile version