Site icon NTV Telugu

PM Modi: చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం

Pmmodi3

Pmmodi3

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు కాశ్మీర్ ప్రజల కల నెరవేరిందని.. ఇది ఐక్యత, సంకల్పానికి చిహ్నంగా మోడీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రశంసలు కురిపించారు, ఇది భారతదేశ మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఒక మైలురాయిగా కొనియాడారు. అంతేకాకుండా జాతీయ ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత మరియు సంకల్ప శక్తికి ఒక గొప్ప వేడుక అని మోడీ ప్రకటించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ ఇప్పుడు భారతదేశపు విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిందన్నారు.

ఇది కూడా చదవండి: Shining Stars Awards: ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు.. మార్గదర్శకాలు విడుదల

చినాబ్ రైల్వే వంతెన..
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంత్రి యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుంది.

ఇది కూడా చదవండి: HHVM: వెనక్కి తగ్గిన వీరమల్లు.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన

ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు.

 

 

 

Exit mobile version