NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..

Pm Modi

Pm Modi

PM Modi: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీకి, ఆ దేశ అత్యున్నత గౌరవం లభించింది. పీఎం మోడీకి ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆప్ ది ఇండియన్ ఓషియన్’’తో సత్కరించింది. మారిషన్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులం మంగళవారం ప్రధాని నరేంద్రమోడీకి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ప్రధాని మోడీకి ఇది 21వ అంతర్జాతీయ అవార్డు. మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయులు కూడా ప్రధాని మోడీనే. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లాడు. పోర్ట్ లూయిస్‌లో జరిగిన ఇండియన్ కమ్యూనిట కార్యక్రమంలో రామ్‌గులం ఈ ప్రకటన చేశారు.