Site icon NTV Telugu

PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ప్రధాని మోడీ..

Pm Modi (2)

Pm Modi (2)

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.

Read Also: Election Commission: 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు

ఈ రోజు ప్రధాని బిజీబిజీగా గడిపారు. మధ్యప్రదేశ్ లో పర్యటించారు. వందేభారత్ రైళ్లను భోపాల్ నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రెండు చట్టాలపై నడవదని, అందరికి సమాన హక్కుల్ని రాజ్యాంగం సూచిస్తుందని, సుప్రీంకోర్టు కూడా యూసీసీపై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు.

యూసీసీ పనేరతో ప్రతిపక్షాలు ముస్లింలను రెచ్చగొడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం భోపాల్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

Exit mobile version