PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
- పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ
- కార్మికుల పరిస్థితిపై ఏఐసీడబ్ల్యూఏ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశంలో పొదుపు మంత్రం అమలవుతోంది. ప్రపంచ సంక్షోభం వేళ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పొదుపు మంత్రం పాటిస్తున్నారు.

Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇలాంటి తరుణంలో భారత సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితిపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్న స్టార్ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలు తమ ఖర్చులను పునరాలోచించాలని కోరింది.

కోవిడ్ మహమ్మారి సమయంలో భారత సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని లేఖలో గుర్తుచేసింది. లక్షలాది మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉద్యోగాలు కోల్పోయారని.. చాలా మంది జీతాల్లో భారీ కోతలు ఎదుర్కొన్నారని పేర్కొంది. రోజువారీ కూలీలుగా పనిచేసే అనేక మంది జీవనోపాధి కోసం పరిశ్రమను వదిలి తక్కువ వేతన ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

అలాగే చిన్న, మధ్య తరహా నిర్మాణ సంస్థలు కోవిడ్ సమయంలో మూతపడటంతో సినిమా, టెలివిజన్, ప్రకటనల రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొంది. కోవిడ్ తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదని.. షూటింగులు తగ్గిపోవడం, ఉద్యోగాల్లో కోతలు, అనిశ్చిత పరిస్థితుల కారణంగా అనేక మంది పరిశ్రమను శాశ్వతంగా వదిలిపెట్టారని తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు, నిర్మాణ వ్యయాల పెరుగుదల సినీ పరిశ్రమపై కొత్త భారం మోపుతున్నాయని హెచ్చరించింది. ఈ పరిస్థితి మరింత దిగజారితే సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, ప్రకటనల షూటింగులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది. ఫలితంగా సినీ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు మరింత క్షీణించి.. రోజువారీ వేతన కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లు, భారీ నిర్మాణ సంస్థలు అవసరం లేని ఖర్చులను తగ్గించాలని AICWA కోరింది. ‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో పెద్ద స్టార్లు, ఆర్థికంగా బలమైన నిర్మాణ సంస్థలు అధిక పారితోషికాలను పునరాలోచించాలి. అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు, సమయానికి జీతాలు, వారి గౌరవం కాపాడబడతాయి’’ అని లేఖలో పేర్కొంది. విదేశాల్లో షూటింగులకు బదులుగా భారత్‌లోనే ఎక్కువగా చిత్రీకరణలు నిర్వహించాలని కూడా సూచించింది. దీంతో స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధులు, అత్యవసర సహాయ పథకాలు రూపొందించాలని AICWA విజ్ఞప్తి చేసింది. మరోసారి సినీ పరిశ్రమలో ఆర్థిక, మానవతా సంక్షోభం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల కమల్‌హాసన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తవించారు. సినీ పరిశ్రమ పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?