Maratha quota: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం ఉద్యమిస్తున్న నాయకుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. మనోజ్ జరాంగే ఆదివారం ముంబైకి మార్చ్‌ని ప్రకటించాడు. ఆయన నివాసం వెలుపల తెలుపుతామని అన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేయమని కొంతమందిని ప్రలోభ పెడుతున్నారని, ఈ కుట్రల వెనక దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడని, నన్ను చంపాలనుకుంటున్నాడని, నేను వెంటనే సాగర్ బంగ్లా( ముంబాయిలో మలబార్ హిల్‌లో ఫడ్నవీస్ అధికార నివాసం)కి మార్చ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జారంగే హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Botsa Satyanarayana: అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా జగన్ గెలుపును ఆపలేరు
తన నిరాహార దీక్ష సమయంలో తన సెలైన్ బాటిల్‌లో విషం కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్రంలో మరాఠా ప్రాబల్యాన్ని అంతం చేయాలని ఫడ్నవీస్ చూస్తున్నాడని అన్నారు. తనను ఎన్‌కౌంటర్‌లో చంపేస్తానని డిప్యూటీ సీఎం కలలు కన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ ముందు సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు మరో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నిస్సహాయంగా ఉన్నారని విమర్శించారు. అయితే, ఈ మార్చ్‌ని విరమించుకోవాలని అతని మద్దతుదారులు కోరినప్పటికీ.. మనోజ్ జరంగే ముంబై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే మాట్లాడుతూ.. ఫడ్నవీస్‌ని చేరుకోవడానికి పార్టీ కార్యకర్తల భారీ గోడను దాటాలని జరాంగేని హెచ్చరించారు. అతను కావాలంటే రాజకీయాల్లోకి రావాలని, కానీ ఫడ్నవీస్‌పై ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేయవద్దన్నారు. ముంబై బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భత్ఖల్కర్ మాట్లాడుతూ..జరాంగే నిజమైన ముఖం ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అతను ఎందుకు నిరసన కొనసాగిస్తున్నాడంటూ ప్రశ్నించారు. మరాఠాలందరినీ కుంబీగా పరిగణించి – మహారాష్ట్రలోని ఓబీసీ బ్లాక్ కింద ఒక కులంగా పరిగణించి, తదనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని జరంగే డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తు్న్నాడు.