Site icon NTV Telugu

Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్

Ahmedabad

Ahmedabad

Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంత‌ర్జాతీయస్థాయి ప్రమాణాల‌తో రైల్వేస్టేష‌న్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ‌ర‌ల్డ్ క్లాస్ వ‌స‌తుల‌తో అల‌రారుతున్న అంత‌ర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేష‌న్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేర‌కు అహ్మదాబాద్‌లో నిర్మించ‌నున్న వ‌రల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్ ఊహా చిత్రాల‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

త్వర‌లోనే అహ్మదాబాద్ ప్రజ‌ల‌కు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేష‌న్ వ‌స‌తుల విష‌యంలో ఏ ఒక్క అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోద‌ని కేంద్రమంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. అహ్మదాబాద్‌కు ప్రధాని న‌రేంద్ర మోదీ ఇస్తున్న మ‌రో బ‌హుమ‌తిగా ఈ రైల్వే స్టేష‌న్ నిల‌వ‌నున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వేస్టేషన్ ఊహాచిత్రాలను చూస్తుంటే వావ్ అని నెటిజన్‌లు నోరెళ్లపెడుతున్నారు. అటు ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ కోసం స్పెషల్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కొన్ని వందల కోట్లను ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులను ఉపయోగించబోతున్నారు. అయితే అన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుజరాత్‌కే తరలించడాన్ని కొన్ని రాష్ట్రాలు తప్పుబడుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version