NTV Telugu Site icon

IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..

Ic814

Ic814

IC 814: The Kandahar Hijack: 1999 లో జరిగిన ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ ఘటన నేపథ్యంలో “IC 814 ది కాందహార్ హైజాక్” వెబ్ సిరీస్ నిర్మితమైంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ వెబ్‌సిరీస్ వివాదాల్లో ఇరుక్కుంది. హైజాకింగ్‌కి పాల్పడిన ఇస్లామిక్ టెర్రరిస్టులకు హిందూ పేర్లు ఉండటంపై వివాదం ప్రారంభమైంది. హైజాకింగ్‌కి పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరికి భోలా, శంకర్ అనే పేర్లతో పిలవడంపై ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Read Also: IC 814 Hijack: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’పై వివాదం..హైజాకర్లకు హిందూ పేర్లు.. అసలు నిజం ఇదే..

మరోవైపు, ఈ వివాదంపై కేంద్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్‌కి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ని బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. హైజాకింగ్‌లో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపును ఈ సిరీస్ వక్రీకరిస్తుందని పిల్ ఆరోపించింది. 1999లో ఇండియన్ ఫ్లైట్ 814 హైజాక్‌కు సంబంధించిన చిత్రణలో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన టెలివిజన్ మినిసిరీస్ “IC 814: ది కాందహార్ హైజాక్”కి వ్యతిరేకంగా న్యాయవాది శశిరంజన్ ద్వారా పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

Read Also: IC 814 hijacking: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’.. దేశాన్ని కుదిపేసిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ ఘటన..

నిజానికి హైజాకర్లు హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ మరియు షకీర్‌‌లు వీరంతా పాకిస్తానీ జాతీయులు. పిటిషనర్ ప్రకారం.. ఇది హైజాకర్ల గుర్తింపుని వక్రీకరిస్తోంది,చారిత్రక సంఘటనలను తప్పుగా సూచిస్తుంది, హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుంది మరియు హిందూ సమాజం యొక్క మనోభావాలను కించపరుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అపార్థం చేసుకోకుండా కోర్టు జోక్యాన్ని పిటిషనర్ కోరారు. రాజ్యాంగంలోని లౌకిక వాదం, మతసామరస్యం అన్ని మతాలను గౌరవించే ప్రాథమిక హక్కుని నిర్దేశిస్తుందని పిటిషన్ పేర్కొన్నారు.

Show comments