NTV Telugu Site icon

Fight on flight: ఎయిర్‌బస్‌ను ఎర్ర బస్సు చేశారు కదరా.. ఫ్లైట్‌లో చితక్కొట్టుకున్న ప్రయాణికులు

Fight In Flight

Fight In Flight

Fight on flight: ఇటీవల కాలంలో ఫ్లైట్ లో ప్రయాణికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. వీరిని శాంతింప చేయడం విమాన సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. థాయ్ స్మైల్ ఎయిర్ వేస్ లో ప్రయాణికులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.

Read Also: Doc-1 Max Cough Syrup: ఉజ్బెకిస్తాన్‌లో భారత దగ్గు మందుతో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన ప్రభుత్వం

ముందుగా వాగ్వాదంతో ప్రారంభం అయిన ఈ గొడవ ఆ తరువాత చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో షూట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ప్రయాణికులు ఒకరితో ఒకరు వాదించుకోవడం ఇందులో చూడవచ్చు. విమాన సిబ్బంది వారిద్దరిని వారించే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు ‘‘శాంతి సే బాత్’’(నిశ్శబ్ధంగా కూర్చొండి) అని చెబుతుంటే మరొకరు ‘‘హాత్ నీచే కర్’’( మీ చేయి కిందకు దించండి) అంటూ వాదించుకున్నారు. ఆ తరువాత కన్ని సెకన్ల వ్యవధిలోనే ఇద్దరు భౌతికంగా దాడికి పాల్పడతారు.

ఓ వ్యక్తి తన కళ్లద్దాలను తీసివేసి, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని కొట్టడం చూడవచ్చు. ఆ తరువాత ఆ వ్యక్తి తరుపున వచ్చిన అతని స్నేహితులు కూడా ఆ ప్రయాణికుడిపై దాడి చేయడం చూడవచ్చు. ప్లీజ్ స్టాప్ అంటూ ఫ్లైట్ అటెండెంట్లు అరుస్తున్నా పట్టించుకోకుండా దాడి చేయడం కనిపిస్తుంది. సహ ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈ ఘటనపై థాయ్ స్మైల్ ఎయిర్ వేస్ స్పందించలేదు. ప్రయాణికుల చర్యలపై ఎటువంటి సమచారం లేదు.