Site icon NTV Telugu

Pfizer Vaccine: దుమారం రేపుతోన్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్.. కొనుగోలు చేయాలని ప్రధానిపై కాంగ్రెస్ ఒత్తిడి..

Pfizer Vaccine

Pfizer Vaccine

Pfizer tried bullying India: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ తో దుమారాన్ని రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ రచ్చకు దారితీసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను ఎంచుకోవడం కన్నా, విదేశీ తయారీ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణను కోరినట్లు భారత ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. దీని వల్ల భవిష్యత్తులో చట్టపరమైన దావాల నుంచి మినహాయింపులు వస్తాయని ఆ కంపెనీ భావించింది.

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లాను మీడియా ప్రశ్నలు అడిగింది. కరోనాపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయడం లేదని..దీన్ని మీరు ఎందుకు దాచారంటూ మీడియా ప్రశ్నించింది. మొదటగా 100 శాతం పనిచేస్తుందని.. ఆ తరువాత 80, 70 శాతం సమర్థంగా ఉంటుందని మీరు చెప్పారు కానీ వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతుందని జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనికి సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ వీడియోను జోడిస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.

Read Also: Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే

ఫైజర్ తన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సరఫరా చేయడానికి భారత ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాం రమేష్ విదేశీ వ్యాక్సిన్లను కొనుగోలు చేసేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. చిదంబర్ డిసెంబర్ 27, 2021న ‘‘భారతదేశంలో కేవలం మూడు వ్యాక్సిన్‌లు మాత్రమే అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు: కోవిషీల్డ్, కోవాక్సిన్ మరియు స్పుత్నిక్ ఈ మూడింటిలో, మీరు స్పుత్నిక్‌ను రద్దు చేయవచ్చు, ఎందుకంటే ప్రారంభ రోజులలో తక్కువ పరిమాణంలో మాత్రమే దిగుమతి చేసుకున్నారు కాబట్టి’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే భారత్ దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా కరోనాను కట్టడి చేసింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న చైనా వ్యాక్సిన్లు, అమెరికా వ్యాక్సిన్లు కూడా భారత వ్యాక్సిన్ల ముందు చిన్నబోయాయి. అక్కడ ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి చెందుతూనే ఉంది. భారత తయారీ కోవీషీల్డ్, కోవాగ్జిన్లను ప్రజలకు ఇచ్చింది. ఇప్పటి వరకు 220.16 కోట్ల డోసులను ప్రజలకు రెండేళ్ల వ్యవధిలో ఇచ్చారు.

Exit mobile version