NTV Telugu Site icon

Petrol prices: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ రాష్ట్రంలో అంటే..!

Eke

Eke

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ముంబై ప్రాంతంలో పెట్రోల్ లీటరుకు 65 పైసలు, డీజిల్ లీటరుకు రూ.2 తగ్గించింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జూన్ 28న (శుక్రవారం) రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధర లీటరుకు 65 పైసలు తగ్గుతుంది. ఇక డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు.

ఇక బడ్జెట్‌లో 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో పాటు పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించినట్లు తెలుస్తోంది.